Jabilamma neeku antha kopama: ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం ఓటీటీలోకి.. 9 d ago

ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో చిత్రం 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం' రొమాంటిక్ కామెడీగా ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చింది. దీనిని తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' పేరుతో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రాన్ని డిజిటల్ హక్కులను 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 21న ఓటీటీలో తమిళం అందుబాటులోకి వచ్చింది. తాజాగా దీనికి తెలుగు వెర్షన్ కూడా సడెన్ గా అమెజాన్ లో ప్రత్యక్షమైంది. ఇక ఈ చిత్రం సౌత్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.